Tapsee Pannu – Mathias Boe | బాలీవుడ్ నటి తాప్సీ పన్ను రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మతియాస్ బో అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం తన భర్త గురించి కానీ.. తన గురించి కానీ ఎక్కడ న్యూస్ రాలేదు. తాప్సీ కూడా అతడితో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయలేదు. అయితే తన తాజా చిత్రం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగష్టు 09న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన రిలేషన్షిప్ గురించి అడుగగా.. తాప్సీ సమాధానమిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాప్సీ ఈ ఏడాది మార్చి 23న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన ఎంగేజ్మెంట్ మాత్రం 9 ఏళ్ల క్రితమే అయినట్లు ప్రకటించింది. మతియాస్ బో ను నేను 11 ఏళ్ల ముందు కలిశాను. 1 ఇయర్ వరకు డేటింగ్లో ఉన్న తర్వాత మతియాస్ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడే మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అయితే ఇన్ని సంవత్సరాలు మేము విడిపోకుండా ఉన్నామంటే అది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లనే. అయితే మా ఫస్ట్ డేట్‌కి దుబాయ్ వెళ్లామని చెప్పుకోచ్చింది.
ఇక తాప్సీ భర్త విషయానికి వస్తే.. మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతడు 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అలాగే 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012 మరియు 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.