Jailer 2 | కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలు తెరకెక్కించి తమిళంలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar). ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ (rajinikanth)తో తెరకెక్కించిన జైలర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని తెలిసిందే. దీనికి కొనసాగింపుగా సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2) కూడా రాబోతుండగా.. అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అంతేకాదు ఈ చిత్రానికి హుకుం టైటిల్‌ను దాదాపు ఫైనల్ చేసినట్టు కోలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదే నిజమైతే జైలర్ పార్టు 1లో వచ్చే హుకుం సాంగ్ పేరునే సీక్వెల్‌కు టైటిల్‌గా పెట్టడంతో సినిమాపై మరింత హైప్ రావడం పక్కా అని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు, ట్రేడ్ పండితులు. ఇక పార్టు 1లో నటించిన పాపులర్ కమెడియన్ యోగిబాబు, మిర్నామీనన్ సీక్వెల్లో కూడా సందడి చేయబోతున్నారు.
జైలర్ 2లో తన పాత్రను ప్రత్యేకంగా నిలిచిపోయేలా నెల్సన్ దిలీప్ కుమార్ స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడని ఓ చిట్‌చాట్‌లో చెప్పాడు యోగిబాబు. తలైవా నుంచి మరో బ్లాక్ బస్టర్ రెడీ అవుతుందని తెలియడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు అభిమానులు. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జైలర్ గతేడాది ఆగస్టు 09న రిలీజ్ కాగా.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
జైలర్‌లో తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, వసంత్ రవి, వీటీవీ గణేశ్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మరి సీక్వెల్లో ఎవరెవరు కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
“Idhu Oru periya Network” – it’s just the beginning.
August 10 2023 – Industry Hit #Jailer
August 10 2024 – Mission continues #Jailer2 ka #Hukkum
🔥🔥🔥🔥🔥#Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #Vettaiyan | #SuperstarRajinikanth pic.twitter.com/8rUAhByRPs
— Suresh balaji (@surbalutwt) August 8, 2024
Indian 2 | ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇండియన్ 2.. ఫ్లాట్‌ఫాం ఇదే
NTR Neel | లాంఛింగ్ రోజే విడుదల తేదీ ఫైనల్.. ఎన్టీఆర్ 31 థియేటర్లకు వచ్చే టైం ఇదే
Mahesh Babu | మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త లుక్
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?