Indian 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2 (Indian 2). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
ఇక ఇండియన్ 2గా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్. ఇండియన్ 2 పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నేటి నుంచి (ఆగస్టు 9) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ 2పై ఓ లుక్కేయండి.
అవినీతి, లంచం లాంటి అంశాల చుట్టూ సాగే ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కించారు.
Tamil Flim #Indian2 Uncut Version
🎥 (3 hrs 5 secs) ~#Indian2 Uncut Version is coming to Netflix on 9 August (Tonight) in Tamil, Telugu, Malayalam and Kannada!
🎭 Genre : Action | Thriller#OTT_Noww #PrimeVideo pic.twitter.com/vlWKQc4MUs
— OTT NOW ! (@OTT_NOWW) August 8, 2024
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Simbaa review | డెబ్యూ డైరెక్టర్ ప్రయత్నం ఫలించిందా.. జగపతిబాబు సింబా ఎలా ఉందంటే..?