Explosion | స్విట్జర్లాండ్లో జరిగిన న్యూఇయర్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్కీ రిసార్ట్ పట్టణం (ski resort town) క్రాన్స్ మోంటానా (Crans Montana)లోని ఒక బార్లో పేలుడు (Explosion) సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.
లే కాన్ట్సెలేషన్ అనే బార్లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో బార్లో 100 మందికిపైగా ఉన్నారు. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు బార్ మొత్తం వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కొత్త ఏడాది రోజున ఈ ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Telugu Student | న్యూఇయర్ వేళ విషాదం.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి
New Year 2026 | కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రపంచ దేశాలు.. వీడియోలు చూశారా..?
Zohran Mamdani: సబ్వే స్టేషన్ వద్ద న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మామ్దానీ ప్రమాణ స్వీకారం