Zohran Mamdani: సబ్వే స్టేషన్ వద్ద న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ ప్రమాణ స్వీకారం
Zohran Mamdani: న్యూయార్క్ సిటీ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ(Zohran Mamdani) గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్ గ్రంధంపై చేయి వేసి ఆయన ప్రమాణం చేశారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేపట్టడాన్ని గౌరవంగా, జీవితకాల అవకాశంగా భావిస్తున్నట్లు మామ్దానీ తెలిపారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటా జేమ్స్ ప్రమాణం చేయించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా మామ్దానీ నిలిచారు. ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగడం గమనార్హం. భారతీయ మూలాలు ఉన్న మామ్దానీ ఆఫ్రికాలో జన్మించారు. న్యూయార్క్ సిటీకి మేయర్‌గా అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశారు. మామ్దానీ వయసు 34 ఏళ్లు. ఫ్రీ చైల్డ్‌కేర్, ఫ్రీ బస్సులు లాంటి ఎన్నికల హామీలు చేశారాయన.
ఉగాండా రాజధాని కంపాలాలో మామ్దానీ జన్మించారు. ఫిల్మ్‌మేకర్ మీరా నాయర్, మహమూబ్ మామ్దానీ దంపతులకు ఆయన పుట్టారు. జోహ్రాన్ ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం న్యూయార్క్‌కు వలస వెళ్లింది. 2018లో అమెరికా పౌరుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున రాజకీయ ప్రచారం నిర్వహించారు. జోహ్రాన్ భార్య రమా దువానీ.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

