నటీనటులు: అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్
డైరెక్టర్ : మురళీమనోహర్ రెడ్డి
నిర్మాతలు : సంపత్ నంది, రాజేందర్
మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ సౌరభ్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
ఎడిటింగ్ : తమ్మిరాజ్
సినిమాటోగ్రాఫర్ : కృష్ణ ప్రసాద్
ఓ వైపు ఫ్యామిలీ హీరోగా, మరోవైపు విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్నాడు జగపతిబాబు (Jagapathi Babu). యాంకర్ నుంచి నటిగా మారి.. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్ (Anasuya). ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం (Simbaa) ఏమైంది ఈ వేళ సినిమాతో రైటర్ కమ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కథనందించిన చిత్రం సింబా. సంపత్ నంది దర్శకత్వ శాఖలో పలు సినిమాలకు పనిచేసిన మురళీమనోహర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ (డెబ్యూ) చేశాడు. సంపత్‌నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించారు. మరి పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో మురళీ మనోహర్ చేసిన ప్రయత్నం ఫలించిందా..?
కథలోకి వెళ్తే..
హైదరాబాద్‌లో దారుణ హత్య జరుగుతుంది. ఈ కేసును పోలీసులు ఛేదించే క్రమంలో మరో హత్య వెలుగుచూస్తుంది. వరుస హత్యల వెనుక స్కూల్ టీచర్ అక్షిక (అనసూయ)తోపాటు శ్రీనాథ్ మాగంటి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో వారిద్దిరినీ హత్య చేసేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి పోలీసుల ఎదుటే హత్యకు గురవుతాడు. అయితే ఈ సారి మాత్రం అక్షిక, ఫాజిల్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఈ హత్యలో పాల్గొంటారు. కేసు విచారణలో తెరపైకి వచ్చిన జగపతిబాబు (పురుషోత్తమ్) ఎవరు..? వరుస హత్యలకు ఆయనకేంటి సంబంధం ఉందా..? అనే అంశాల చుట్టూ సాగుతుంది కథ.
ఎలా ఉందంటే.. ?
ది ఫారెస్ట్ మ్యాన్‌గా జగపతిబాబు పాత్ర ఇంప్రెసివ్‌గా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. మురళీ మనోహర్ డైరెక్టర్‌గా తొలి సినిమా అయినా ఈ చిత్రంలో బయోలాజికల్ మెమోరీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఇంట్రెస్టింగ్ చూపించే ప్రయత్నం చేశాడని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. సెల్యూలార్ మెమొరీ అనే కొత్త పాయింట్‌తో మొక్కలు నాటాలని ఇచ్చిన సందేశం ప్రకృతిని కాపాడుకోవాలనే ఆవశ్యకతను తెలియజేసేలా ఉందంటున్నారు మూవీ లవర్స్.
అనసూయ టీచర్‌గా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసిందంటున్నారు. ఇక వశిష్ఠ సింహాను పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ రోల్లో చూపించాడని చెబుతున్నారు. పర్యావరణం, మొక్కలు, ప్రకృతి అంశాలకు రివేంజ్ డ్రామాను జోడిస్తూ సాగే ఈ సినిమాను మిగిలిన అంశాల మాటెలా ఉన్నా.. మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఓ సారి చూసేయొచ్చని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.
ప్రపంచంలో గాలి కాలుష్యం వల్ల 65శాతం మంది చనిపోతున్నారు. సిగరెట్, మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది పాతికరెట్లు ఎక్కువ. మొక్కలు మనతోనే ఉంటాయి. మనతో పాటు పెరుగుతాయి. మన తరువాత కూడా ఉంటాయి.. సినిమా ట్రైలర్లోనే అందరినీ ఆలోచింపజేసే సంభాషణలు రాసి.. వృక్షో రక్షతి రక్షిత: అంటూ ముఖ్యమైన సందేశాన్ని అందించాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సింబా రిలీజ్ ట్రైలర్ ..
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Vettaiyan | ఒకే ఫ్రేమ్‌లో ఫహద్ ఫాసిల్, బిగ్ బీ, తలైవా.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Hari Hara Veera Mallu | గెట్ రెడీ.. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ యాక్టర్
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!