Hari Hara Veera Mallu | సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఖాతాలో సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న ఓజీ (They Call Him OG),హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. బర్త్ డేన ఓజీ మేకింగ్ వీడియోతోపాటు హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి.
తాజాగా హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) టీం ఇంట్రెస్టింగ్ అప్డేట్తో బర్త్ డే ట్రీట్‌పై హింట్ ఇచ్చేసింది. హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్‌కు స్వాగతం పలుకుతూ లుక్ ఒకటి షేర్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ వార్తతో ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతూ.. సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
Team #HariHaraVeeraMallu is honoured and happy to welcome aboard the Legendary actor and one of the greats of Indian Cinema, Shri @AnupamPKher to the prestigious Magnum Opus 🔥
More updates very soon. ⚔️💥
Power Star 🌟 @PawanKalyan pic.twitter.com/GHy02hdZpu
— BA Raju’s Team (@baraju_SuperHit) August 8, 2024
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!
SJ Suryah | సరిపోదా శనివారంలో నాని పాత్ర ఇదే.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్