Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!
Pushpa 2 The Rule | టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్ప ప్రాంఛైజీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ పాత్రలో నటించాడు.
Pushpa 2 The Rule | టాలీవుడ్, పాన్ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా పుష్ప ప్రాంఛైజీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ పాత్రలో నటించాడు.
తాజాగా బర్త్ డే విషెస్ చెబుతూ ఫహద్ ఫాసిల్ లుక్ విడుదల చేశారు. పార్ట్ 1లో ఒక్కటి తగ్గింది.. అంటూ సందడి చేసిన షెకావత్ సార్ ఈ సారి మాత్రం గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీలో ఓ చేతిలో గొడ్డలి.. మరో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపిస్తున్నాడు. షెకావత్‌గా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Team #Pushpa2TheRule wishes the stellar actor #FahadhFaasil a very Happy Birthday ❤🔥
Bhanwar Singh Shekhawat IPS will be back with a bang on the big screens 💥💥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP… pic.twitter.com/NGHNaMZ7EW
— Mythri Movie Makers (@MythriOfficial) August 8, 2024
Read Also :
SJ Suryah | సరిపోదా శనివారంలో నాని పాత్ర ఇదే.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

