Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయని తెలిసిందే. నాని అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలోగ్యాంగ్లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాని పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పాడు ఎస్జే సూర్య. చిన్న తనం నుంచి కోపం ద్వారా వచ్చే సమస్యలతో సతమతమయ్యే నాని పాత్ర ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు. ఈ సమస్య నుంచి తనను తాను నియంత్రించుకునేందుకు అతని తల్లి నానికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్లాన్ సెట్ చేస్తుంది. అయితే శనివారానికి మాత్రం మినహాయింపు తీసుకుంటాడు నాని. మరి శనివారం ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చేసుకుంటాయనే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ఎస్జే సూర్య హింట్ ఇచ్చి ప్రేక్షకులు, అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
ఈ సినిమాను ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన స్టిల్స్‌లో.. ఆఫీసులో నాని.. డ్యూటీ (కానిస్టేబుల్)లో ప్రియాంకా మోహన్ చాట్‌లో ఉన్నారు. సూర్య : హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే.. చారు : హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4:05 ? అని పెట్టగా.. చారు 4:05 ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకునే స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది.
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!