Road Accident : విశాఖపట్నం జిల్లాలో దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పద్మనాభం ఘాట్(Padmanabha Ghat Road) రోడ్డులో ఒక కారును చెట్టును ఢీకొని లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు మరణించినట్టు సమాచారం. ఎత్తు నుంచి కింద పడడంలో కారు చాలావరకు దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని నర్సీపట్నం వాసులుగా గుర్తించారు.
ఆదివారం సెలవురోజు కావడంతో నర్సీపట్నానికి చెందిన కొందరు కారులో ఆలయ దర్శనానికి వెళ్లారు. స్వామి దర్శనం పూర్తి చేసుకొని వస్తుండగా.. ఘాట్రోడ్డులోఅదుపుతప్పి చెట్టును ఢీకొన్న వీరి కారు పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్టు సమాచారం.