Vettaiyan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న అతికొద్ది మాలీవుడ్ నటుల్లో ఒకడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). పుష్ప ది రైజ్ సినిమాతో తెలుగులో సూపర్ ఫేం సంపాదించాడు. ఈ క్రేజీ యాక్టర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండగా.. ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న వెట్టైయాన్ (Vettaiyan)లో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఫహద్ ఫాసిల్. షూటింగ్ సమయంలో భారతీయ సినిమా సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్‌తో ఫహద్ ఫాసిల్ కలిసి దిగిన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముగ్గురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బర్త్ డే సందర్భంగా ఇప్పటికే వెట్టైయాన్ నుంచి ఫహద్ ఫాసిల్ లుక్ విడుదల చేయగా.. కాలేజ్ స్టూడెంట్‌లా బ్యాగ్ వేసుకొని హాయ్ చెప్తున్నట్టు ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరోవైపు పుష్ప ది రూల్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న వెట్టైయాన్ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది.
A click to treasure ❤️🔥
VETTAIYAN IT IS 💥#FahadhFaasil #SuperstarRajinikanth@rajinikanth @SrBachchan#HBDFahadhFaasil #வேட்டையன் #Vettaiyan pic.twitter.com/viUcKs04Le
— Sony Music South (@SonyMusicSouth) August 8, 2024
SJ Suryah | సరిపోదా శనివారంలో నాని పాత్ర ఇదే.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?