Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ (Pilot) వద్ద మద్యం వాసన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన కెనడా (Canada)లోని వాంకోవర్ ఎయిర్‌పోర్టులో గత వారం చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన విమానం AI186 గత నెల 23న వాంకోవర్ (Vancouver) ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై సిద్ధంగా ఉంది. ప్రయాణికులు కూడా అందులో ఎక్కి కూర్చున్నారు. అయితే, ఆ విమానాన్ని నడపాల్సిన పైలట్ వద్ద మద్యం వాసన రావడాన్ని విమానాశ్రయ సిబ్బంది గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అలర్ట్ అయిన ఎయిర్‌పోర్టు అధికారులు.. పైలట్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అయితే, ఆ టెస్ట్‌లో అతను విఫలమయ్యాడు. ఇక వెంటనే అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కెనడియన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ ఘటన కారణంగా విమానం ఆలస్యం కావడంపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, భద్రతా ప్రొటోకాల్స్‌ను పరిగణనలోకి తీసుకొని వేరే పైలట్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని స్పష్టం చేసింది.
Also Read..
LPG cylinder | కొత్త ఏడాది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
New Year 2026 | కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రపంచ దేశాలు.. వీడియోలు చూశారా..?
Nitish Kumar | రూ.1.48 కోట్ల ఫ్లాట్, రూ.20,552 నగదు.. ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం