Sai Pallavi | కెరీర్లో అతి తక్కువ టైంలోనే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ భామల్లో ఒకరు సాయిపల్లవి (Sai Pallavi). శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్, ఫిదా సినిమాలతో అందరినీ మనసు దోచేసిన సాయిపల్లవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నెట్టింట ఈ భామకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ ముంబైకి వెళ్లింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తోన్న తాజా చిత్రం అమరన్ (Amaran). దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు. తమిళంతోపాటు పలు ప్రధాన భాషల్లో అక్టోబర్ 31న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో అమరన్కు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. సాయిపల్లవి స్టూడియోలో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అమరన్‌లో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. శివకార్తికేయన్ రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో జాతీయ జెండా ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అమరన్కు సంబంధించి కథానుగుణంగా కశ్మీర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. కశ్మీర్లో 75 రోజులపాటు అమరన్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పటికే ఎస్కే 21 కశ్మీర్ షూటింగ్ లొకేషన్లో సాయిపల్లవి, శివకార్తికేయన్ దిగిన ఫొటోలు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి.
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Vettaiyan | ఒకే ఫ్రేమ్‌లో ఫహద్ ఫాసిల్, బిగ్ బీ, తలైవా.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Hari Hara Veera Mallu | గెట్ రెడీ.. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ యాక్టర్
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!