Mangalavaaram | ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తన తొలి సినిమా దర్శకుడైన అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన సినిమా మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం 2023 నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మంగళవారం మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ +హాట్ స్టార్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ప్రీమియర్ కాగా..అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం మరో భాషలో సందడి చేసే టైం వచ్చేసింది. మంగళవారం హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. పాపులర్ ఛానల్ జియో సినిమాలో మంగళవారం హిందీ వెర్షన్ ఆగస్టు 9 (నేడు) నుంచి ప్రీమియర్ అవుతోంది. ఇంకేంటి మరి హిందీలో చూసేయండి.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మంగళవారంలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
#Mangalavaaram Hindi Dubbed World TV Release On 9th August 2024 On Zee Cinema.
Title as: “Mangalavaar” 🤩
It’s #PayalRajput Film@starlingpayal @DirAjayBhupathi @Nanditasweta @PriyadarshiPN @RavindraVijay1 @MudhraMediaWrks @ACreativeWorks_ pic.twitter.com/JnQNOAEoeG
— OTT Cinema Movies Series Hindi Updates (@cinema_abhi) July 30, 2024
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Vettaiyan | ఒకే ఫ్రేమ్‌లో ఫహద్ ఫాసిల్, బిగ్ బీ, తలైవా.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Hari Hara Veera Mallu | గెట్ రెడీ.. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ యాక్టర్
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!