ముంబై : జింబాబ్వే క్రికెటర్, ఆ దేశ టీ20 కెప్టెన్ సికందర్ రాజా(Sikandar Raza) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. సికందర్ రాజా సోదరుడు మహమ్మద్ మహది 13 ఏళ్ల వయసులోనే మృతిచెందాడు. సికందర్ సోదరుడి మృతి పట్ల జింబాబ్వే క్రికెట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిసెంబర్ 29వ తేదీన హరారేలో మహది తుదిశ్వాస విడిచాడు. పుట్టుకతోనే హిమోఫిలియా వ్యాధితో మహది బాధపడుతున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం మరీ క్షీణించింది. వారెన్ హిల్స్ సిమెట్రీలో డిసెంబర్ 30వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సికందర్ రాజా కుటుంబానికి జింబాబ్వే క్రికెటర్లు, మేనేజ్మెంట్ సంఘీభావం తెలిపింది.
— Sikandar Raza (@SRazaB24) December 31, 2025