Mahesh Babu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్‌బాబు (Mahesh Babu) పుట్టినరోజును అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా బర్త్ డే సందర్భంగా మహేశ్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) సస్పెన్స్ లుక్ ఒకటి విడుదల చేసింది. మహేశ్ బాబు అగ్రెసివ్‌గా కనిపిస్తున్న ఈ స్టిల్ గుంటూరు కారంలోనిదంటూ ఫ్యాన్ తెగ చర్చించుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా కోసం డిఫరెంట్ స్క్రిప్టును సిద్దం చేయడమే కాదు.. అందుకనుగుణంగా కొన్ని పోర్షన్లను కూడా చిత్రీకరించాడట. అయితే పలు కారణాల వల్ల ఆ సన్నివేశాలను తొలిగించారని.. అందులోనిదే ఈ స్టిల్ అని చర్చ నడుస్తోంది. గుంటూరు కారం ప్రమోషన్స్‌లోనే ఈ పోస్టర్ విడుదల చేస్తే బాగుండేది అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజా స్టిల్ గుంటూరు కారం ఫస్ట్ లుక్‌ను డామినేట్ చేసేలా ఉండటం వల్లే సస్పెన్స్ లుక్‌ను సీక్రెట్‌గా ఉంచారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కారణాల సంగతి ఎలా ఉన్నా ఈ కొత్త లుక్ మాత్రం అభిమానులను థ్రిల్ అందిస్తోంది. ప్రస్తుతం మురారి 4K వెర్షన్ రీరిలీజ్‌ను థియేటర్లలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
Wishing the Reigning Superstar, our beloved @urstrulyMahesh garu, a fabulous birthday! ❤️🔥 Your unparalleled charm, grace and versatility continue to set the bar high in cinema🔥💥#HBDSuperStarMahesh 💫🌟 pic.twitter.com/n0Vqw6eg0u
— Haarika & Hassine Creations (@haarikahassine) August 9, 2024
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Simbaa review | డెబ్యూ డైరెక్టర్ ప్రయత్నం ఫలించిందా.. జగపతిబాబు సింబా ఎలా ఉందంటే..?