NTR Neel | గ్లోబల్ స్టార్ యాక్టర్‌గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవరతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే ఎన్టీఆర్ 31 (NTR 31) లాంఛ్ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్‌కు తారక్ సతీమణి ప్రణతి, నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఓపెనింగ్ డేన విడుదల తేదీని కూడా ప్రకటించి సర్ప్రైజ్ అప్డేట్ అందించాడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్.
తారక్ ప్రస్తుతం దేవర, వార్ 2 షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలిసిందే. దేవర రెండు పార్టులుగా వస్తుండగా.. పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే ఎన్టీఆర్ 31 NTR Neel వార్త బయటకు రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతున్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
The moment we all have been waiting for is here 🤩#NTRNeel begins with an auspicious Pooja Ceremony 🪔 💫
The DUO is all set to create a MONSTROUS HAVOC at the BOX OFFICE ❤️🔥
See you all on his land from 𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔 🔥
Man of Masses @tarak9999… pic.twitter.com/rzNzrsZIcG
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024
Mahesh Babu | మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త లుక్
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?