Shravya Varma – Kidambi Srikanth | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మేనకోడలు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. వర్మ మేనకోడలు సినీ నిర్మాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఒక్కటికానున్నారు. తాము శనివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కిదాంబి శ్రీకాంత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడిస్తూ.. శ్రావ్య నాకు ఓకే చెప్పింది. మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ రాసుకోచ్చాడు.
శ్రావ్య వర్మ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు అక్కినేని నాగార్జున, పంజా వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహారించింది. ఇక శ్రావ్య వర్మ తన మేనకోడలని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఈవెంట్లో పరిచయం చేశాడు.
Also Read..