Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ సినిమా ఇంద్ర (Indra) . బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. చిన్ని కృష్ణ కథనందించిన ఈ చిత్రం 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. చిరంజీవి కెరీర్లోనే అప్పటివరకు ఉన్న కలెక్షన్ల మార్క్‌ను దాటేసిన చిత్రంగా ఇంద్ర నిలిచింది.
ఈ సినిమా విడుదలై ఇటీవలే విజయవంతంగా 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, మూవీ లవర్స్ కోసం చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రీ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. అయితే బర్త్ డే దగ్గర పడుతుండగా.. మరోవైపు మేకర్స్ నుంచి మాత్రం కొత్త వార్త ఏమీ రాకపోవడంతో అభిమానులు అప్సెట్లో ఉన్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇండ్ర రీరిలీజ్‌కు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అందించాలని కల్కి 2898 ఏడీ మేకర్స్ అయిన వైజయంతీ మూవీస్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. రీరిలీజ్ ట్రెండ్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పేలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలంటూ కోరుతున్నారు. మరి వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఫ్యాన్స్ కోసం ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి. ఇంద్రలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, ముఖేశ్ రిషి, పునీత్ ఇస్సార్, తనికెళ్లభరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Indra
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !