Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న మట్కా (Matka). ఈ చిత్రానికి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి అదిరిపోయే లుక్ షేర్ చేశారు.
కమాండ్ చేసేందుకు, జయించేందుకు ఇక్కడ ఉన్నాడు.. మట్కా కింగ్ వాసును కలవండి.. అంటూ షేర్ చేసిన తాజా పోస్టర్లో వరుణ్ తేజ్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపిస్తుండగా.. టేబుల్‌పై ఓ వైపు పిస్తోల్, మరోవైపు డబ్బు కనిపిస్తు్న్నాయి. ఇప్పటికే ప్రొడక్షన్ టీం 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్‌ను రీక్రియేట్ చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట.
He is here to COMMAND and CONQUER 👊
Meet Mega Prince @IamVarunTej as THE MATKA KING, VASU 🔥#MatkaFirstLook out now❤️🔥#MATKA ~ The game begins soon on the big screens💥
A @KKfilmmaker Film@Meenakshiioffl #NoraFatehi @gvprakash @drteegala9 #RajaniTalluri @SRTMovies pic.twitter.com/aHxZuQwxu6
— Vyra Entertainments (@VyraEnts) August 11, 2024
Jailer 2 | తలైవా జైలర్ 2 లోడింగ్ గురూ.. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ మూవీకి టైటిల్ ఫిక్స్..!