Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో సందడి చేసింది విక్రమ్ టీం. పాపులర్ బాబాయ్ హోటల్లో విక్రమ్, మాళవికా మోహనన్, ఇంగ్లీష్ నటుడు డానియల్ కల్టగిరోన్ బ్రేక్ ఫాస్ట్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. తంగలాన్ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నాడు విక్రమ్. బాబాయ్ హోటల్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకు ఎంతలా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా అపరిచితుడు సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ.
డైరెక్టర్ రంజిత్ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ స్పందన తెలియజేస్తారా అని ఎదురుచూస్తున్నా. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్ తో ఈ సినిమా చేశాను. పా రంజిత్ ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తంగలాన్ మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరాడు విక్రమ్.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Nayanthara | మహారాజ డైరెక్టర్‌తో నయనతార.. సినిమా టైటిల్ ఇదే
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!