Nayanthara | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది కన్నడ భామ నయనతార (Nayanthara). తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయని తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమా వార్తతో ఫాలోవర్లు, ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది నయనతార.
ఇటీవలే మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు నిథిలన్ స్వామినాథన్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. తాజా చిత్రాన్ని ఈ డైరెక్టర్‌తోనే చేస్తోంది నయన్. నిథిలన్, నయన్ కాంబోలో రాబోతున్న సినిమాకు మహారాణి టైటిల్ కూడా ఫైనల్ చేశారు. Passion studios బ్యానర్‌పై తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఏ జోనర్లో ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నయనతార తమిళంలో తనీ ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మూకుట్టీ అమ్మన్ 2, టెస్ట్ Mannangatti Since 1960, మలయాళంలో డియర్ స్టూడెంట్స్, కన్నడలో యశ్ నటిస్తోన్న టాక్సిక్, తెలుగులో కన్నప్ప చిత్రాలతోపాటు పలు సినిమాలను లైన్లో పెట్టింది. ఈ చిత్రాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. పదికిపైగా సినిమాలను లైన్లో పెట్టి అభిమానులకు ఊపిరాడకుండా చేస్తోంది నయన్.
Director Nithilan who has given recent Blockbuster #Maharaja, is doing his next movie with #Nayanthara 🎬
Titled as ‘#Maharani‘
Produced by Passion studios !!
©️VP pic.twitter.com/4pTJAr5n8q— AmuthaBharathi (@CinemaWithAB) August 12, 2024
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!