Draupadi2 | వివాదాస్పద చిత్రాల దర్శకుడు మోహన్ జి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద్రౌపది’ సీక్వెల్ ‘ద్రౌపది 2’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య శనివారం రాత్రి విడుదలైన ఈ ట్రైలర్, నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తొలి భాగం సమకాలీన సామాజిక అంశాల చుట్టూ తిరగగా, ఈ సీక్వెల్ 14వ శతాబ్దపు హోయసల సామ్రాజ్య కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్లో చూపిన కొన్ని చారిత్రక ఘర్షణలు, డైలాగులు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ చిత్రంలో హీరోగా నటించిన రిచర్డ్ రిషి మరోసారి పవర్ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు. కథనాయికగా నటించిన రక్షణ ఇందుచూడన్ తన నటనతో ఆకట్టుకోనుంది. మహ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ కనిపించబోతున్నారు. స్టార్ కంపోజర్ జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇందులోని ‘నెలరాజే’, ‘తారాసుకి’ పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ఈ చిత్రం జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సంక్రాంతి సీజన్ దృష్ట్యా, అంతకంటే ముందే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.