PM Modi : గుజరాత్ (Gujarat) లోని సోమ్నాథ్ (Somnath) లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ‘శౌర్య యాత్ర (Shaurya Yatra)’ ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో మహదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ‘సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ (Somnath Swabhiman Parv)’ ఉత్సవానికి హాజరుకానున్నారు.
అంతకుముందు ప్రధాని శౌర్యయాత్ర శోభాయమానంగా జరిగింది. యాత్ర పొడవున జనం నీరాజనం పట్టారు. వివిధ కళలకు సంబంధించిన కళాకారులు తమ కళలను ప్రదర్శించి అబ్బురపరిచారు. కాగా మూడు రోజుల గుజరాత్ పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం సోమ్నాథ్కు చేరుకున్నారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
ఆ తర్వాత అక్కడ జరిగిన ‘ఓంకార్ మంత్ర’ అనే సామూహిక ఆలపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాగా సోమ్నాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి జరిగింది. ఆ దాడి నుంచి తట్టుకుని వెయ్యేళ్లుగా సోమ్నాథ్ ఆలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
#WATCH | Gujarat | After concluding the ‘shaurya yatra’, PM Narendra Modi offers prayers at Somnath Temple.
Source: DD pic.twitter.com/RnYhVzBQi6
— ANI (@ANI) January 11, 2026