The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబోలో వస్తోన్న చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. The GOAT నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశాడు వెంకట్ ప్రభు.
ఇదిలా ఉంటే మేకర్స్ సరికొత్తగా డిజైన్ చేసిన పోస్టర్ల ద్వారా చేస్తున్న ప్రమోషనల్ ప్లాన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కాలం, రోడ్డు, విమానం, పారాచూట్, ట్రైన్, టవర్స్ బిల్డింగ్స్ థీమ్‌తో ది గోట్ పోస్టర్లను రెడీ చేసింది విజయ్ టీం. ఇప్పుడీ పోస్టర్లు నెట్టింట ట్రెండింగ్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్‌గా, మరోవైపు యంగ్ లుక్‌లో కనిపిస్తున్న లుక్‌తో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
Loved the idea of #GOAT posters from @VP_Trends maintaining the mood of the film throughout the poster👌
The intensity of this posters shows how the movie travels in various locations which includes Time , Road , Flight, Parachute got an idea how the film… pic.twitter.com/q1TAveC4xx
— Monesh (@MoneshMj) August 11, 2024
Nayanthara | మహారాజ డైరెక్టర్‌తో నయనతార.. సినిమా టైటిల్ ఇదే
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!