Ravi Teja | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తోన్న ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సుమ, భాగ్య వీళ్లే మన తెలుగు ప్రేక్షకులు.. వరల్డ్ ఫేమస్ ప్రేక్షకులు ఫొటో తీయండి.. అని రవితేజ అంటుంటే సుమ, భాగ్య శ్రీ బోర్సే తమ సెల్ఫోన్లతో అందరినీ (ప్రేక్షకులు) ఫొటో తీయడం చూడొచ్చు. ఇక మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోలు బుకింగ్స్ ఓపెన్ అయిపోయినయ్.. బుకింగ్ చేసుకోండి మరి అంటూ రవితేజ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ నెట్టింట మిలియన్లకుపైగా వ్యూస్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తుండగా.. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే మధ్య వచ్చే రెప్పల్ డప్పుల్ సాంగ్ ఊరమాస్‌గా సాగుతూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో మాస్ మహారాజా అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఈ మూవీకి ఇమిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కాగా.. రవితేజ ఈ చిత్రంలో కథానుగుణంగా బిగ్ బీ అభిమానిగా కనిపించనున్నాడని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
Hello world famous TELUGU AUDIENCE…#MrBachchan Premiere shows bookings open aipoyayi…
Book cheskondi mari 💥💥https://t.co/7uRjFB642f pic.twitter.com/FYFMPoglvH
— Ravi Teja (@RaviTeja_offl) August 13, 2024
Double ISMART | రామ్ డబుల్ ఇస్మార్ట్‌ను తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?