Vijay Sethupathi | పాపులర్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ (Big Boss Tamil) కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఉలగనాయగన్ కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించడంతో నెక్ట్స్ ఎవరు ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక బిగ్ బాస్ తమిళ్ కొత్త సీజన్‌కు హోస్ట్ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తే చాలా మంది శింబు పేరు చెప్పారు. దీంతో ఇక శింబు హోస్ట్‌గా చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కామింగ్ టైమింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్రజెంటేషన్‌తో ఆకట్టుకోవడం విజయ్ సేతుపతి స్టైల్. వచ్చే సీజన్‌కు మక్కళ్ సెల్వన్ హోస్ట్‌గా రాబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేనప్పటికీ.. ఒకవేళ ఇదే నిజమైత బిగ్ బాస్ తమిళ్ కొత్త సీజన్‌కు విజయ్ సేతుపతి ఎంట్రీ తప్పకుండా డబుల్ క్రేజ్ తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
ఇటీవలే మహారాజతో సూపర్ హిట్టు కొట్టిన మక్కళ్ సెల్వన్ ప్రస్తుతం Gandhi Talks, విడుదల పార్ట్ 2ల్లో నటిస్తున్నాడు. మరి బిగ్ బాస్ షోపై ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. కమల్ హాసన్ ముందుగా ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్టు ప్రకటించాడని తెలిసిందే. మరి ఆయన స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Thangalaan | భారీ సక్సెస్.. విక్రమ్ తంగలాన్పై కంగువ యాక్టర్ సూర్య
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?