Mr Bachchan | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు మిస్టర్ బచ్చన్ (Mr Bachchan), రాజాసాబ్ (Raja Saab). ఈ రెండు సినిమాలను లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. వీటిలో హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన మిస్టర్ బచ్చన్ మరికొన్ని గంటల్లో (ఆగస్టు 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ప్రభాస్ అభిమానుల కోసం మిస్టర్ బచ్చన్ టీం అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుందన్న వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు. థియేటర్లలో ఒకేసారి రవితేజ, ప్రభాస్‌ను చూస్తే ఎలా ఉంటుంది. మిస్టర్ బచ్చన్ స్క్రీనింగ్ టైంలో అదే జరుగబోతుందట. రాజాసాబ్ గ్లింప్స్‌ను మిస్టర్ బచ్చన్ స్క్రీనింగ్ టైంలో డిస్ ప్లే చేసి అభిమానులను ఖుషీ చేసేలా రవితేజ టీం ప్లాన్ చేసుకుందన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజాసాబ్‌ను ట్రెండింగ్ టాపిక్‌గా మార్చడంలో భాగంగా మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తుందననడంలో ఎలాంటి సందేహం లేదు. మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.
మారుతి అండ్ టీం విడుదల చేసిన రాజాసాబ్ గ్లింప్స్ వీడియోలో.. ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vijay Sethupathi | కమల్ హాసన్‌ను రీప్లేస్ చేసెదెవరు..? బిగ్ బాస్ తమిళ్ హోస్ట్‌గా మరో స్టార్ హీరో పేరు..!
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్