Sai Durga Tej | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని టాలీవుడ్ స్టార్ నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమల చేరుకున్న సాయి దుర్గ తేజ్.. బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు. మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా ఇవాళ తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
Supreme Hero @IamSaiDharamTej sought the divine blessings of Lord Venkateswara at Tirumala today #SaiDharamTej #SaiDurghaTej pic.twitter.com/IkeH9ItV0I
— Vamsi Kaka (@vamsikaka) November 6, 2024
కాగా, సాయి దుర్గ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం SDT18. రోహిత్ కేపీ (Rohit KP) దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది.
Also Read..
Actress Kasturi | తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి కస్తూరిపై చెన్నైలో కేసు నమోదు
Ramayana Movie | అఫీషియల్.. రెండు పార్టులుగా బాలీవుడ్ ‘రామాయణం’ .. విడుదల తేదీ కూడా ఫిక్స్