Allu Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్నేహారెడ్డి (Allu Sneha Reddy) స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు. అయితే స్నేహారెడ్డి నేడు తిరుమల రావడానికి కారణం తన భర్త అల్లు అర్జున్‌పై ఉన్న కేసు అని తెలుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్(2024) సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసుపై నేడు తుది తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కాగా.. ఈ కేసు విషయంలోనే స్వామివారిని స్నేహారెడ్డి దర్శించుకున్నట్లు సమాచారం.