Ramayana Movie | బాలీవుడ్ మోస్ట్ ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్ట్ రామాయణం సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురాబోతునట్లు ఫస్ట్ పార్ట్‌ను దీపావళి కానుకగా 2026లో అలాగే రెండో పార్టును దీపావళి కానుకగా 2027లో తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసింది.
భారతీయ ఇతిహాసం ఆధారంగా రానున్న ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
MASSIVE DEVELOPMENT… ‘RAMAYANA’ PART 1 & 2 RELEASE DATE ANNOUNCEMENT… Mark your calendars… #NamitMalhotra‘s #Ramayana – starring #RanbirKapoor – arrives in *theatres* on #Diwali 2026 and 2027.
Part 1: #Diwali2026
Part 2: #Diwali2027
Directed by #NiteshTiwari. pic.twitter.com/3BRWR0bg2L— taran adarsh (@taran_adarsh) November 6, 2024