Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
ఎప్పుడూవృత్తిపరమైన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే మహేశ్ బాబు తీరిక సమయం దొరికితే చాలు ఏదో వెకేషన్ ప్లాన్ చేస్తాడు. టైం దొరికితే కుటుంబసభ్యులతో కలిసి సరదా షికారు చేస్తుంటాడు.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)సినిమాలు, బ్రాండ్ల ప్రమోషన్స్ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడని తెలిసిందే. వృత్తిపరమైన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే మహేశ్ బాబు తీరిక సమయం దొరికితే చాలు ఏదో వెకేషన్ ప్లాన్ చేస్తాడు. టైం దొరికితే కుటుంబసభ్యులతో కలిసి సరదా షికారు చేస్తుంటాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఎక్కడికెళ్లాడో తెలుసా..? మహేశ్ తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్ వేశాడు.
మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ లండన్ ట్రిప్ సెల్ఫీ, ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మహేశ్ న్యూ అవతార్‌లో కనిపిస్తూ.. అభిమానులకు ఫిదా చేస్తున్నాడు. ఈ ఫొటోలు తక్కువ టైంలోనే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28లో నటిస్తున్నాడు.
పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కొంతభాగం షూటింగ్ జరుపుకోగా.. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మృతితో వాయిదా పడ్డది. త్వరలో కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ రానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
లండన్‌లోని అందమైన లొకేషన్లలో షికారు..
Read Also : Brahmanandam | డబ్బింగ్ స్టూడియోలో బ్రహ్మానందం.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

