పుణె: జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval)కు .. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డును అందజేశారు. పుణెలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్ 106వ వర్థింతి సందర్భంగా అవార్డును అందజేశారు. లోక్మాన్య తిలక్ స్మారక్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ మాట్లాడుతూ.. దేశ భద్రతకు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌కు, బోర్డర్ సెక్యూర్టీకి పాల్పడుతున్న అజిత్ దోవల్‌కు అందజేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డులో భాగంగా ఓ మెమొంటో, ప్రశంసా పత్రం, లక్ష క్యాష్ ప్రైజ్ ఇస్తారు.
తమకు చెందిన రంగాల్లో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన వారికి ప్రతి ఏడాది ఈ అవార్డును అందజేస్తారు. దేశ ప్రయోజనాల రక్షణ కోసం సేవ చేసిన అజిత్ దోవల్‌ను ఈ ఏడాది అవార్డు కోసం ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్, నేషనల్ సెక్యూర్టీ అంశంలో అజిత్ దోవల్ సుదీర్ఘ కెరీర్ ఉన్నది. ఆపరేషన్ బ్లాక్ థండర్, డోక్లామ్ దౌత్య చర్చలు, బాలాకోట్ వైమానిక దాడుల్లో అజిత్ దోవల్ పాత్ర కీలకమైంది. 1968 నాటి కేరళ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. మూడు దశాబ్ధాల పాటు భారత ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. మిజోరం, సిక్కిం, పంజాబ్, జమ్మూకశ్మీర్ లాంటి సున్నిత ప్రదేశాల్లో ఆయన పనిచేశారు. దీంతో పాటు ఇస్లామాబాద్, లండన్ పట్టణాల్లోనూ చేశారు. ప్రస్తుతం దోవల్ వయసు 81 ఏళ్లు. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్‌గా సుదీర్ఘ కెరీర్లో కొనసాగుతున్నారు.
VIDEO | Pune, Maharashtra: Union Home Minister Amit Shah presents Lokmanya Tilak National Award 2026 to NSA Ajit Doval.#AmitShah #AjitDoval
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ARvX6i2bN0
— Press Trust of India (@PTI_News) August 1, 2026