Pawan Kalyan | ప్రధానమంత్రి నరేంద్రమోదీని చాలా మంది జెన్ జీ యువత తిడుతుంటే, ఆయనను అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలింది. కన్నీళ్లొచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశం కోసం కష్టపడేవారికి ఇవా మనం చివరకు ఇచ్చేదన్నారు. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన (ప్రధాని) పడ్డ కష్టం. మన ప్రధాన మంత్రి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఈ రోజు మనకు పెట్టుబడులు వస్తున్నాయి. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్శ్య పడే పశ్చిమ దేశాలను తట్టుకుని.. ఓ వైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది.. కేవలం మేమున్నాం.. మీ వెంట. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే.. ఇదే మనం వారికివ్వాల్సిందన్నారు పవన్‌కల్యాణ్ .
ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం
ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు
– పవన్ కళ్యాణ్ pic.twitter.com/xuXJW5GoA1
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026