ACR Raids : రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వరసగా అక్రమార్కులు పట్టుబడుతున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న స్వర్ణకుమారి (Swarna Kumari) లక్ష రూపాయల లంచం తీసుకున్న ఘటన మరవకముందే టౌన్ ప్లానింగ్ అధికారిణి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. జీహెచ్ఎంసీ(GHMC) గోల్కొండ జోన్లో పట్టణ ప్రణాళిక సూపర్వైజర్గా సేవలందిస్తున్న తులసీరాం సునీత (Tulasiram Sunitha) రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది.
అవినీతి నిరోధక శాఖ వరసగా జరుపుతున్న దాడుల్లో మరో ప్రభుత్వ అధికారిని పట్టుబడింది. జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్లో పట్టణ ప్రణాళిక సూపర్వైజర్గా సేవలందిస్తున్న తులసీరాం సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అదేశాలను బేఖాతరు చేస్తూ.. భవన నిర్మాణదారుడికి అధికారికంగా లబ్ది చేకూర్చడం కోసం రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసింది సునీత.
సోమవారం ఫిర్యాదుదారు నుంచి నాలుగు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. సునీత ఆఫీసులో సోదాలు చేయగా లభించిన రూ.2.5లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన సునీతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను నాంపల్లిలోని అడిషనల్ ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున.. భద్రతా కారణాలరీత్యా ఫిర్యాదుదారు వివరాలను వెల్లడించడం లేదని ఏసీబీ పేర్కొంది.