Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన కాంతార సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన చిత్రం కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మించారు. కాంతార సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమాపై ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. కాంతార చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన అల్లు అరవింద్, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతోపాటు స్టార్ హీరోయిన్ అనుష్క ఆకాశానికెత్తేశారు. కాగా ఈ జాబితాలో ఇపుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా చేరిపోయారు.
‘తెలిసిన దానికంటే తెలియనిది ఎక్కువ.. సినిమాల్లో ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరు. కాంతార సినిమాతో నాకు గూస్బంప్స్ తెప్పించారు. రిషబ్ శెట్టి ..ఓ రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మీకు హ్యాట్సాఫ్. భారతీయ సినిమాలో అద్భుత కళాఖండం. కాంతార నటీనటులు తారాగణం, టీంకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
కాంతార చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అంజనీష్ లోక్ నాథ్ కాంతార చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
“The unknown is more than the known” no one could have said this better in cinema than @hombalefilms #KantaraMovie you gave me goosebumps @shetty_rishab Rishab hats off to you as a writer,director and actor.Congrats to the whole cast and crew of this masterpiece in indian cinema
— Rajinikanth (@rajinikanth) October 26, 2022
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

