Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
స్పై థ్రిల్లర్‌గా వచ్చిన సర్దార్ (Sardar) అక్టోబర్ 21న విడుదలైంది. తెలుగు, తమిళంతోపాటు విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని చివరలో పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు కార్తీ (Karthi). ఈ టాలెంటెడ్ హీరో పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో నటించిన చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలై మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని చివరలో పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్.
అయితే ఇపుడు సర్దార్ 2 చిత్రంపై కార్తీ టీం అధికారికంగా అప్డేట్ ఇచ్చి.. అభిమానులు, మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంది. ఒకసారి స్పై అయితే, ఎప్పుడూ స్పై.. మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అంటూ మేకర్స్ సర్దార్ 2 గురించి చెబుతూ చిన్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేయనున్న సర్దార్ 2 మూవీ 2023లో విడుదల కానుంది.
కార్తీ వచ్చే ఏడాది సీక్వెల్స్ ప్రాజెక్ట్‌లతో రానుండటం ఆసక్తికర విషయం. ఇటీవలే వచ్చిన పొన్నియన్ సెల్వన్-1 మంచి హిట్టు అందుకుంది. దీనికి సీక్వెల్ పొన్నియన్ సెల్వన్ -2, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో చేయబోతున్న ఖైదీ 2 కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఓ యాక్టర్ ఇలా వరుసగా సీక్వెల్ ప్రాజెక్ట్‌లతో ఒకే ఏడాది రావడం చాలా అరుదనే చెప్పాలి.
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

