నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న చిత్రం 18 పేజెస్ (18 Pages). పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. హీరో నిఖిల్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు.
కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ 18 పేజెస్ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యాడని తెలియజేస్తూ మేకర్స్ విడుదల తేదీపై అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్‌గా థియటర్లలో విడుదల కానుంది. నిఖిల్ మూవీ సెట్స్‌లో చిత్రయూనిట్‌తో కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఈ ఏడాది నిఖిల్-అనుపమ కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సూపర్ హిట్ సీక్వెల్‌కు కొనసాగింపుగా కార్తికేయ ౩ కూడా రానుంది. దీనికి సంబంధించిన వివరాలపై నిఖిల్ -చందూమొండేటి టీం నుంచి అప్డేట్ రావాల్సి ఉంది.
ట్రెండింగ్‌లో స్టిల్..
After the EPIC BLOCKBUSTER success of #Karthikeya2, @actor_Nikhil Joins the Final Schedule Shoot of #18Pages
Genius director @aryasukku's story!📝
Dec 23rd Theatrical Release
✨Happy Diwali Blasting Updates loading. #AlluAravind @anupamahere @dirsuryapratap #BunnyVas pic.twitter.com/Odn6nmdyNZ— Geetha Arts (@GeethaArts) October 24, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే