టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan), జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe Trailer). ఫన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ డిజిటల్‌గా లాంఛ్ చేశారు.
మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ ట్రావెల్ వ్లోగర్ విప్లవ్ గా నటిస్తున్నాడు. సంతోష్ శోభన్ అరకులో ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. కానీ ఈ ఇద్దరు సమస్యలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది..? వారిద్దరూ ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డారనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.
ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్..
A Huge thanks to our dearest Darling Hero, Global Star #Prabhas garu for Launching the #LikeShareSubscribe Traile😊❤️
Watch Here!
– https://t.co/REVE44qg1Q#LSS IN CINEMAS NOV 4th😃@santoshshobhan @fariaabdullah2 @GandhiMerlapaka @NiharikaEnt #AamukthaCreations @saregamasouth pic.twitter.com/djZSF5uMBj— Niharika Entertainment (@NiharikaEnt) October 25, 2022
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్