Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు సుధీర్ బాబు (Sudheer Babu)..సుధీర్ బాబు తాజా మరో సినిమాను ప్రకటించాడు.
టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) ఇటీవలే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. సుధీర్ బాబు సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
సుధీర్ బాబు తాజా మరో సినిమాను ప్రకటించాడు. సుధీర్ బాబు 18వ ప్రాజెక్టు (Sudheer Babu 18th film)ను ఇన్ లాండ్ లెటర్ పోస్టర్‌తో లాంఛ్ చేశాడు. ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఎస్సీ (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అరుణ్ గౌలి ఆఫ్ సౌత్ బాంబే ఫ్రమ్ అడ్రస్‌తో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యంకు ఈ లేఖను రాసినట్టు అర్థమవుతుంది. లేఖలో ‘విషమం.. మీరు తప్పకుండా రావాలి.. ‘అనే సందేశం కూడా ఉంది. గ్రామం, గుడి, తుపాకి, బుల్లెట్స్ పాత రూపాయి నోటు, ల్యాండ్ లైన్ ఫోన్, సిగరెట్ కూడా పోస్టర్లో కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 31న మాస్ సంభవం అని పేర్కొన్నారు. దీన్ని బట్టి అక్టోబర్ 31న మా మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. 1989 కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్‌తో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు సమాచారం. సుధీర్ బాబు గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపింబోతున్నట్టు టాక్.
His Arrival Is Much Needed ✅🔥
'Nitro Star' @isudheerbabu in Never Seen Before MASS AVATAR ❤️🔥😎#Sudheer18 #𝙈𝙖𝙨𝙨𝙎𝙖𝙢𝙗𝙝𝙖𝙫𝙖𝙢 Loading on October 31st! 🤙🏻🤙🏻
Directed by @gnanasagardwara 🎬
Produced by #SumanthGNaidu under @SSCoffl pic.twitter.com/GoxIvYbBwQ— BA Raju's Team (@baraju_SuperHit) October 27, 2022
Read Also : Brahmanandam | డబ్బింగ్ స్టూడియోలో బ్రహ్మానందం.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

