బురదమయంగా సీసీ రోడ్డు.. నడవాలంటేనే జంకుతున్న జనం
పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆళ్లపల్లి మండల పరిధి మర్కోడు పంచాయతీ 5వ వార్డు అంబేద్కర్ కాలనీ సీసీ రోడ్లు చిన్న చినుకులకే ఇలా బుర్దమయంగా మారుతున్నాయి. సైడ్ డ్రైనేజీల మట్టి తీసి రోడ్డుపై వేసి వదిలేయడంతో..
ఆళ్లపల్లి, ఆగస్టు 01 : పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆళ్లపల్లి మండల పరిధి మర్కోడు పంచాయతీ 5వ వార్డు అంబేద్కర్ కాలనీ సీసీ రోడ్లు చిన్న చినుకులకే ఇలా బుర్దమయంగా మారుతున్నాయి. సైడ్ డ్రైనేజీల మట్టి తీసి రోడ్డుపై వేసి వదిలేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం బురద మయంగా మారాయి. కనీసం నడవడానికి వీలు లేకుండా ఉంటున్నాయని కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీసీ రోడ్డు మర్కోడులోని బొడ్రాయి సెంటర్ వద్ద ప్రధాన రహదారికి వెళ్లే రహదారి. ఈ ఈ రహదారి వెంబడి పాఠశాలకు వెళ్లే పిల్లలు, అంగన్వాడీ పిల్లలు, నిత్యవసరాలకు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, కూలీలు ప్రతినిత్యం నడిచే దారి ఇది. వర్షాకాలం కావడం వల్ల ప్రజలు ఈ దారిలో నడవాలంటే జంకుతున్నారు. కావున అధికారులు స్పందించి మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును సీసీ రోడ్డుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

