sunil as mangalam srinu in pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్, అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టు సినిమా నుంచి రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ క్రమంలో విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి పాటలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.
Set yourselves up for the unexpected 😎
— Pushpa (@PushpaMovie) November 6, 2021
Introducing @Mee_Sunil as #MangalamSrinu tomorrow at 10:08 AM.#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/WeudfLDl1Y
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న పుష్ప సినిమాలో తొలి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే శ్రీవల్లి, సామి పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. మరో అప్డేట్ వచ్చేస్తుంది. ఆదివారం ఉదయం సునీల్ ఫస్ట్ లుక్ రిలీజ్‌చేయబోతున్నారు. పుష్ప సినిమాలో సునీల్.. మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర ఫస్ట్ లుక్ ఆదివారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే కలర్ ఫొటో సినిమాలో సునీల్ విలన్‌గా మెప్పించాడు. ఇప్పుడు మరోసారి పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా రాబోతున్నాడు. ఈ సినిమాలో సునీల్ భార్యగా జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తుంది. ఈ సినిమాలో సునీల్‌తో పాటు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ్ నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
బాలకృష్ణతో కన్నడ హీరో ఢీ.. గోపీచంద్ స్కెచ్ మామూలుగా లేదుగా..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!