Fun bucket: బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!

టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్… అనంతరం,యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి జైలు పాలైన విషయం తెలిసిందే.. చెల్లి చెల్లి అని ఓ బాలికను లోబరుచుకోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు.
విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు.. ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. అయితే సుమారు 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ వస్తున్నాడు. జైలు నుండి వచ్చిన భార్గవ్, సోషల్ మీడియా వేదికగా తాను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేశారు. నెటిజెన్స్ మాత్రం అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బెయిల్ పై బయటకు వచ్చాక… షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమో లో పొందుపరిచారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. నటుడుగా మంచి భవిష్యత్ ఉన్న భార్గవ్ ఇలాంటి కేసులో ఇరుక్కొని తన జీవితం నాశనం చేసుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bhargav
- fun bucket
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

