Bheemla Nayak: సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం

కరోనా కాస్త శాంతించడంతో సినిమాలు థియేటర్స్‌కి క్యూ కడుతున్నాయి. సంక్రాంతి బరిలో పవన్, మహేష్ బాబు, ప్రభాస్ నిలిచేందుకు సిద్ధం కాగా, ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో లెక్కలు అన్ని మారిపోయాయి. కొన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్కి పోటీగా నిలిచేందుకు సిద్ధపడుతుండగా, మరి కొన్ని సోలో రిలీజ్ డేట్ కోసం వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి వాయిదా పడింది.
ఇక జనవరి 12న వస్తుందనుకున్న భీమ్లా నాయక్ చిత్రం కూడా సంక్రాంతి నుండి తప్పుకొని ఫిబ్రవరి 25న విడుదల కానుందనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.. మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియంకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చిత్రంలో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది.అలాగే రానా సరసన ఐశ్యర్యా రాజేష్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో పవర్ స్టార్ అభిమానులు భీమ్లా నాయక్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల లాలా భీమ్లా వీడియో విడుదల కాగా, ఇది ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

