balakrishna and duniya vijay | నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు వరుస సినిమాలు ఒప్పుకుంటూనే.. ఆహా ఓటీటీలో టాక్ షో కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ను తీసుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన క్రాక్ సినిమా హిట్ కావడంతో.. మళ్లీ శృతి హాసన్‌కే మొగ్గుచూపాడు గోపీచంద్. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ నుంచి హీరోను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య సినిమా అంటే పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాబట్టి విలన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే బాలయ్య కోసం స్ట్రాంగ్ విలన్‌ను వెతుకుతున్నాడంట గోపీచంద్. ఈ క్రమంలోనే ధునియా విజయ్ అయితే బాగుంటుందని గోపీచంద్ ఫిక్సయ్యాడని సమాచారం. కన్నడలో విజయ్ పలు సినిమాల్లో నటించాడు. ధునియా సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అదే తన ఇంటి పేరుగా మార్చుకుని ధునియా విజయ్ అయ్యాడు. ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ వంటి కన్నడ హీరోలు తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించి మెప్పించారు. మరి బాలయ్యకు ధీటుగా ధునియా విజయ్ ఎలా ఉంటాడో చూడాలి.
గోపీచంద్ మలినేని సినిమాతో పాటు అల్లు అరవింద్ నిర్మాణంలోనూ బాలయ్య ఒక సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా ( NBK109 )కు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్యతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తలపడనున్నాడని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అంచనాలు పెంచేస్తున్న బాలకృష్ణ అఖండ.. మరి విడుదల ఎప్పుడు..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్‌కు ఎప్పుడొస్తాడు..?