అంచనాలు పెంచేస్తున్న బాలకృష్ణ అఖండ.. మరి విడుదల ఎప్పుడు..?

Balakrishna Akhanda | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌ను మళ్లీ మళ్లీ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. వాళ్ల కాంబినేషన్లో వచ్చే సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. బాలకృష్ణ, బోయపాటి జోడీ కూడా అలాంటిదే. సాధారణంగా బాలకృష్ణ వేరే దర్శకుడితో సినిమా చేస్తే అంచనాలు అంతగా ఉండవు. ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇది నిజం. బిజినెస్‌పై కూడా ప్రభావం పడుతుంది. అదే ఒకవేళ ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తే అంచనాలతో పాటు బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది. ఇతర సినిమాలకు 30 కోట్లకు జరిగితే.. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే 60 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు అఖండ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
గత పదేళ్లలో బాలకృష్ణకు సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో రెండింటికి బోయపాటి శ్రీను దర్శకుడు. దాన్ని బట్టి వారిద్దరి కాంబినేషన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే మూడోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి బాలయ్య ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ దారుణంగా నిరాశపరిచాయి. అలాగే వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి కూడా ప్లాప్ ఇచ్చాడు. ఇలాంటి సమయంలో అఖండ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటి వరకూ విడుదలైన అఖండ స్టిల్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. మరి ఇంత టార్గెట్ అందుకోవాలంటే బాలయ్య-బోయపాటి బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేయాలి. డిసెంబర్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhanda: అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల
Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్‌కు ఎప్పుడొస్తాడు..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

