నందమూరి అభిమానులు బాలకృష్ణ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుండగా, ఈ సినిమా పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ .అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ నవంబర్ 8న విడుదల కానుంది. చిత్ర రిలీజ్ డేట్‌పై ఇంకా సందేహాలు నెలకొని ఉన్నాయి. బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనుండగా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం “అఖండ”. ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “అఖండ” చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.