బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?

Balakrishna movie in Geetha arts | తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో నటించాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. అలాంటి ఒక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన సినిమాలు తక్కువే కానీ విజయాల శాతం ఎక్కువ. గీతా ఆర్ట్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా హిట్ అనే నమ్మకం కలిగించాడు నిర్మాత అల్లు అరవింద్. ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సహ సంస్థలు కూడా వచ్చాయి. అల్లు అరవింద్ నమ్మిన బంటు బన్నీ వాసు వాటిని చూసుకుంటున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం ఇండస్ట్రీలో బాగా గట్టిగా జరుగుతుంది.
మొన్నటివరకు ఇలాంటి ఒక వార్త వస్తే కచ్చితంగా కొట్టిపారేసేవారు. ఎందుకంటే అల్లు అరవింద్, బాలకృష్ణ రెండు భిన్న ధ్రువాలు. వాళ్లు ఎక్కడ కలిసి పని చేస్తారు అని అందరూ అనుకునే వాళ్లు. అయితే ఆహాలో unstoppable అంటూ బాలయ్య ఒక టాక్ షో చేస్తున్నాడు. ఇందులో ఆయన హోస్ట్. కేవలం అల్లు అరవింద్‌పై ఉన్న గౌరవం.. ఆ కాన్సెప్ట్ పై ఉన్న నమ్మకంతో యాంకర్ గా మారిపోయాడు బాలకృష్ణ. ఈ స్నేహంతోనే త్వరలోనే ఈయన గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు అనే విషయం కూడా బయటికి వస్తుంది. ఇప్పటికే బాలయ్య కోసం కథ సిద్ధం చేయాలని తన ఆస్థాన దర్శకులకు అల్లు అరవింద్ హుకుం జారీ చేశాడని.. ప్రస్తుతం దర్శకులు అదే పని మీద బిజీగా ఉన్నారని తెలుస్తోంది. బాలయ్య, అల్లు అరవింద్ కాంబినేషన్లో సినిమాపై అధికారికంగా ప్రకటన రావడం లాంఛనమే అంటున్నారు అభిమానులు. మరి బాలయ్యతో సినిమా కోసం అల్లు అరవింద్ ఎలాంటి కథ సిద్ధం చేయిస్తున్నాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Balakrishna in Hospital | బాలకృష్ణకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం.. షూటింగ్‌కు ఎప్పుడొస్తాడు..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
Unstoppable | ఆహా షో కోసం బాలయ్య అబ్బా అనిపించే రెమ్యునరేషన్..
Balakrishna | బాలకృష్ణపై పవన్ కల్యాణ్ స్పీచ్ ఎఫెక్ట్..!
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

