RRR Sequel | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). సినిమా ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు ఏదో ఒక న్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది ఆర్ఆర్ఆర్. తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన క్షణాలను ఆస్వాదిస్తూ.. సంతోషంలో ఎగిరి గంతేస్తుంది జక్కన్న టీం. ఈ నేపథ్యంలో రాజమౌళి (SS Rajamouli) అంతర్జాతీయ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
చిట్ చాట్ లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ టాపిక్ గురించి జక్కన్నను అడిగారు. ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పనులను వేగవంతం చేసేలా ప్రేరణ కలిగిస్తుందా.. ? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఆస్కార్ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పనులను వేగవంతం చేయడంలో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. ఇక జక్కన్న రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై తీసుకొచ్చే పనిని ఏ క్షణంలోనైనా షురూ చేసే పుష్కలంగా ఉన్నాయని ఈ సమాధానంతో స్పష్టమవుతుంది.
ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని, నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంలో ఇప్పటికే చెప్పాడు జక్కన్న. ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీం గా నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు రాబట్టింది.
జక్కన్న ఇప్పటికే మహేశ్ బాబుతో వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29ను ప్రకటించాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటే ఏ టైంలో రావొచ్చనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Also :
Allu Arjun | ఈ మ్యాజిక్కు కారణం ఎస్ఎస్ రాజమౌళి.. ఆస్కార్‌పై అల్లు అర్జున్
Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. ఇంతకీ షూటింగ్ ఎక్కడంటే..?
Dasara Trailer | యెట్లైతే గట్లాయె సూస్కుందాం.. ఊర మాస్‌గా నాని దసరా ట్రైలర్