Dasara Trailer | యెట్లైతే గట్లాయె సూస్కుందాం.. ఊర మాస్‌గా నాని దసరా ట్రైలర్
నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ దసరా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. వెన్నెలొచ్చిందిరా అంటూ కీర్తిసురేశ్ పాత్ర పరిచయంతో షురూ అయింది ట్రైలర్.
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). పక్కా మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ దసరా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. వెన్నెలొచ్చిందిరా అంటూ కీర్తిసురేశ్ పాత్ర పరిచయంతో షురూ అయింది ట్రైలర్. బొగ్గు గని బ్యాక్ డ్రాప్లో జరిగే సంఘటనల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు దర్శకుడు.
తన గ్యాంగ్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నాని మా నాయినమ్మ తోడు.. ఒక్క దెబ్బ పడ్డా చచ్చిపోతా.. రెండో దెబ్బ పడే పనిసుత లేదు అని చెబుతున్న డైలాగ్స్ అభిమానుల్లో జోష్ నింపేలా ఉన్నాయి. తాగి మరిచిపోవుడు తప్పు కాదు.. తప్పు చేసి మరిచిపోవుడు తప్పు.. అని మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తెలంగాణ యాసలో చెబుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యెట్లైతే గట్లాయె సూస్కుందాం అంటూ నాని చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలువబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే నాని టీం ఫుల్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
దసరా ట్రైలర్..
MASS EXPLOSION in cinemas from March 30th 🤙🏾🔥#DasaraTrailer (HINDI) Out now!https://t.co/1bkSXmLrR2#Dasara #DasaraOnMarch30th
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamaglobal pic.twitter.com/IfGhKCmUTB— SLV Cinemas (@SLVCinemasOffl) March 14, 2023
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

